మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథినీ వసంత పంచమి లేదా శ్రీ పంచమి అంటారు.
మానవులను సృష్టించిన బ్రహ్మ దేవుడు వాక్కు ను ఇవ్వడం మరిచి పోయాడు, అందుకని బ్రహ్మ ద్వారా సృష్టించబడిన ప్రజాపతులు సైగలు మాత్రమే చేసేవారు. అప్పటికింకా భాష లేదు. అప్పుడు బ్రహ్మదేవుడు తాను సృష్టించిన సృష్టిలో లోపాలను తెలుసుకొని వీళ్ళందరికీ సైగలు తప్ప నోటిమాట లేకుండా పోయింది. వీళ్ళు మాట్లాడి తద్వారా ఒకరి భావనలు మరొకరితో పంచుకోవాలని అంటే ఏం చేయాలి అని ఆలోచించి భక్తి శ్రద్ధలతో విష్ణువుని ఆ బ్రహ్మదేవుడు ప్రార్థిస్తాడు.
అప్పుడు విష్ణువు శివుడు శరీరం నుంచి ఒక దివ్య సుందరి ని సృష్టించాడు. ఆ సుందరి తెల్లగా నిగ నిగ లాడుతూ పుట్టింది. పాల నురుగు లాగా మల్లె పువ్వు లా గా చంద్రుడు వెన్నెల లాగా ఉంది. ఈ విధంగా పుట్టుకొచ్చిన ఆ తల్లి సరస్వతి దేవి.(దేవి భాగవతంలో తొమ్మిదో స్కంధంలో బ్రహ్మవైవర్త పురాణంలో భూలోక ఖండంలో ఈ విషయం వివరింపబడింది)
మూడు నదుల సంగమం అయిన సరస్వతి యమున మరియు గంగ లో స్నానం ఆచరించడానికి వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు హరిద్వార్ మరియు అలహాబాద్ కు వస్తారు.
దీనితో పాటు, ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో పసుపు వంటలను తయారుచేసే సంప్రదాయం ఉంది. మరియు ప్రజలు పసుపు దుస్తులను ధరిస్తారు.
వసంత పంచమి లేదా శ్రీ పంచమి నుండి ఏదైనా పని లేదా వ్యాపారాన్ని ప్రారంభిస్తే విజయం సాధిస్తారని నమ్ముతారు. అలాగే, ఏదైనా కొత్త ఇంటి ప్రారంభోత్సవం వంటి పవిత్రమైన కార్యకలాపాలకు ఈ రోజు అధిక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. మొత్తంమీద, ఏదైనా కొత్త పని లేదా వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఈ రోజు చాలా పవిత్రమైనదిగా మరియు ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది.
వసంత పంచమిపై పసుపు రంగు యొక్క ప్రాముఖ్యత?
పసుపు రంగు పంటల శ్రేయస్సు మరియు పక్వానికి చిహ్నం. వసంత ఋతువులు లో పువ్వులు వికసిస్తాయి, ఆవాలు మొక్కలు మరియు గోధుమలు పండిస్తారు, ఇది వసంత పంచమి పండుగతో ప్రారంభమవుతుంది. వీటితో పాటు, పొలాలలో రంగురంగుల సీతాకోకచిలుకలు కనిపిస్తాయి మరియు ఇది వాతావరణానికి అందాన్ని ఇస్తుంది. ఈ పండుగను రిషి పంచమి పేరుతో చాలా చోట్ల పిలుస్తారు.
శ్రీ పంచమి రోజు ఏమి చేయాలి?
- సూర్యోదయానికి ముందు స్నానం చేయాలి.
- సూర్యోదయానికి సరస్వతీ దేవిని ఆలయంలో కానీ ఇంట్లో కానీ అర్చించాలి.
- సరస్వతీదేవికి తెలుపు అంటే ఇష్టంకాబట్టి అమ్మవారి విగ్రహ రూపంలో ఉంటే తెల్లని చీర కట్టి అలంకరించి తెల్లని పూలతో పూజించాలి
- సరస్వతి కవచ స్తోత్రాన్ని పఠించాలి.
- సరస్వతీదేవికి జీడిపప్పుతో మొదలైన వాటితో చిక్కటి ఆవుపాలతో చేసిన నైవేద్యాన్ని సమర్పించాలి.
శ్రీ పంచమిలో చేయకూడని పనులు
- కుటుంబంలో ఎవరితోనూ గొడవ పడవద్దు
- పంట కోయకండి మరియు చెట్లను కత్తిరించవద్దు.
- మాంసాహారం తినకండి మరియు మద్యం సేవించవద్దు.
0 Comments