సోమనాథలింగం
ఈ జ్యోతిర్లింగము చంద్రుని వలన ప్రతిష్టింపబడిందని చెబుతారు. దక్ష ప్రజాపతికి సంతతిలోని అశ్విని మొదలుకొని రేవతి వరకు మొత్తం 27 మంది కుమార్తెలు అందరూ చక్కని చుక్కలే. దక్షుడు తన కుమార్తెలకు సరియైనా జోడుగా భావించి వారిని సౌందర్యమూర్తి అయినా చంద్రుడికి వివాహం చేశాడు. భార్యలందరిలో రోహిణి మరింత అందగత్తె కావటం వల్ల ఆమె పై చంద్రుడు అధికంగా ప్రేమను ప్రకటించసాగాడు. మిగిలిన వారందరికీ ఇది అసూయను కలిగించింది. రోహిణి తప్ప 26 మంది ఈర్షతో తన తండ్రి దగ్గరకు వెళ్లి తమ బాధను చెప్పుకున్నారు.దక్షుడు చంద్రుణ్ణి పిలిచి భార్యలందరిని సమానమైన ప్రేమతో చూడామని నచ్చచెప్పాడు. కానీ మామ గారి మాటలు చంద్రుని మనసునకి ఎక్కలేదు. అందువలన మునుపటికంటే ఎక్కువగా రోహిణి పై అనురాగాన్ని చూపించాడు. అందుకు దక్షుడు పట్టరాని కోపముతో చంద్రుణ్ణి క్షయ రోగంతో పీడించబడుదువు గాక అని శపించాడు. అప్పటి నుంచి ఆ శాపం కారణంగా చంద్రుడు తన కళలను కోల్పోవడం ప్రారంబించాడు. సుధాకరుని సుధాకిరణములు నీరసించి పోవటం వల్ల అమృతమే ఆహారం గా గల దేవతలు హహ కారాలు చేయసాగారు. ఓషధులు వాడిపోయాయి ముల్లోకాలూ అంత నిస్తేజం అయిపోయింది.అపుడు ఇంద్రుడు, దేవతలు, వశిష్టుడు , మునులు కలిసి చంద్రున్ని తీసుకొని బ్రహ్మ దేవుని వద్దకు వెళ్లి ఈ ఆపద నుండి లోకాలన్నింటిని రక్షించమని వేడుకున్నారు. అప్ప్పుడు బ్రహ్మ చంద్రుని తో పవిత్రమైన ప్రభాసతీర్థానికి వెళ్లి పరమశివుని ఆరాదించవలసినదిగాను దానివల్ల సమస్త శుభములు చేకురాగలవాని హితవు చెప్పి,అతనికి మృత్యుంజయ మంత్రాన్ని ఉపదేశించాడు.
ఆ తర్వాత చంద్రుడు దేవి దేవతలతో కలిసి ప్రభాస క్షేత్రానికి వెళ్లి నిష్ఠతో మహేశ్వరుని ఆరాధించి, ఆరు మాసాల కాలం ఘోరమైన తపస్సు చేశాడు దీక్షతో పది కోట్ల సార్లు మృత్యుంజయ మంత్రాన్ని జపించాడు చంద్రుని భక్తికి మెచ్చిన శంకరుడు అతని ముందు సాక్షాత్కరించి వరం కోరుకోమన్నాడు అప్పుడు చంద్రుడు ఆ పరమశివుని కి సాష్టాంగ ప్రణామం చేసి తనను అనుగ్రహించమని శివుని కటాక్ష వీక్షణ మూలను తనపై ప్రసరింపచేసి షాప నివృత్తినీ కలిగించమని ప్రార్థించాడు. కరుణామయుడైన శివుడు చంద్రుని ప్రార్థనను మన్నించి దక్షుడి శాపాన్ని రూపుమాపే అవకాశం లేదని చెప్పి దానికి సవరణలు చేస్తాడు.
కృష్ణపక్షంలో మాత్రం చంద్రుని కళలు క్షీణించే విధంగానూ శుక్లపక్షంలో కళలు దినదిన ప్రవర్ధమానం అయ్యేటట్లు పూర్ణిమ నాటికి కళా పరిపుర్ణుడిగా ఉండేటట్లు వరం ప్రసాదించాడు.
ఈ విధంగా మరల అమరత్వం ప్రసాదించిన చంద్రుడు పూర్ణుడై కళకళలాడుతూ మునుపటివలె అమృత వర్షం కురిపించసాగాడు.ప్రభాస క్షేత్రంలో సోమనాథునిగా నిలిచిపోయాడు. ఈ సోమనాథ లింగము దర్శించటానికి తప్ప తాకటానికి మాత్రం భక్తులకు అవకాశం లేదు. ఈ సోమనాథ క్షేత్రం గుజరాత్ లోని గిర్ సోమనాథ్ జిల్లాలోనీ వెరావల్ ఈ ప్రాంతంలో ఉంది.
ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రమ్
లఘు స్తోత్రం
సౌరాష్ట్రే సోమనాధంచ శ్రీశైలే మల్లికార్జునం|
ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారేత్వమామలేశ్వరం‖
పర్ల్యాం వైద్యనాధంచ ఢాకిన్యాం భీమ శంకరం|
సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే ‖
వారణాశ్యాంతు విశ్వేశం త్రయంబకం గౌతమీతటే |
హిమాలయేతు కేదారం ఘృష్ణేశంతు విశాలకే ‖
ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః |
సప్త జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి ‖
సంపూర్ణ స్తోత్రం
సౌరాష్ట్రదేశే విశదేఽతిరమ్యే జ్యోతిర్మయం చంద్రకళావతంసం|
భక్తప్రదానాయ కృపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే ‖ 1 ‖
శ్రీశైలశృంగే వివిధప్రసంగే శేషాద్రిశృంగేఽపి సదా వసంతం|
తమర్జునం మల్లికపూర్వమేనం నమామి సంసారసముద్రసేతుం‖ 2 ‖
అవంతికాయాం విహితావతారం ముక్తిప్రదానాయ చ సజ్జనానాం|
అకాలమృత్యోః పరిరక్షణార్థం వందే మహాకాలమహాసురేశం‖ 3 ‖
కావేరికానర్మదయోః పవిత్రే సమాగమే సజ్జనతారణాయ |
సదైవ మాంధాతృపురే వసంతం ఓంకారమీశం శివమేకమీడే ‖ 4 ‖
పూర్వోత్తరే ప్రజ్వలికానిధానే సదా వసం తం గిరిజాసమేతం|
సురాసురారాధితపాదపద్మం శ్రీవైద్యనాథం తమహం నమామి ‖ 5 ‖
యం డాకినిశాకినికాసమాజే నిషేవ్యమాణం పిశితాశనైశ్చ |
సదైవ భీమాదిపదప్రసిద్ధం తం శంకరం భక్తహితం నమామి ‖ 6 ‖
శ్రీతామ్రపర్ణీజలరాశియోగే నిబధ్య సేతుం విశిఖైరసంఖ్యైః |
శ్రీరామచంద్రేణ సమర్పితం తం రామేశ్వరాఖ్యం నియతం నమామి ‖ 7 ‖
యామ్యే సదంగే నగరేఽతిరమ్యే విభూషితాంగం వివిధైశ్చ భోగైః |
సద్భక్తిముక్తిప్రదమీశమేకం శ్రీనాగనాథం శరణం ప్రపద్యే ‖ 8 ‖
సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం|
వారాణసీనాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే ‖ 9 ‖
సహ్యాద్రిశీర్షే విమలే వసంతం గోదావరితీరపవిత్రదేశే |
యద్దర్శనాత్ పాతకం పాశు నాశం ప్రయాతి తం త్ర్యంబకమీశమీడే ‖ 10 ‖
మహాద్రిపార్శ్వే చ తటే రమంతం సంపూజ్యమానం సతతం మునీంద్రైః |
సురాసురైర్యక్ష మహోరగాఢ్యైః కేదారమీశం శివమేకమీడే ‖ 11 ‖
ఇలాపురే రమ్యవిశాలకేఽస్మిన్ సముల్లసంతం చ జగద్వరేణ్యం|
వందే మహోదారతరస్వభావం ఘృష్ణేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే ‖ 12 ‖
జ్యోతిర్మయద్వాదశలింగకానాం శివాత్మనాం ప్రోక్తమిదం క్రమేణ |
స్తోత్రం పఠిత్వా మనుజోఽతిభక్త్యా ఫలం తదాలోక్య నిజం భజేచ్చ ‖
0 Comments