ఆకాశంలో ఓ అద్భుతం చోటు చేసుకుంది. గురుడు, శని గ్రహాలు దగ్గరగా చేరి ప్రకాశవంతంగా కనిపించాయి. ఇందుకు సంబంధించి రమణీయమైన దృశ్యాన్ని ఓ కెమెరామన్ సెడెన్ పార్క్ వేదికగా బంధించాడు.
భూమి నుంచి చూస్తే ఏవైనా రెండు గ్రహాలు అతి దగ్గరగా చేరినట్లు కనిపించే దృశ్యాన్ని కంజక్షన్‌గా లేదా సంయోగం పిలుస్తారు.
ఇలా గురు శని గ్రహాలు కనిపించడాన్ని మాత్రం ‘గ్రేట్ కంజక్షన్’ లేదా "మహా సంయోగంగం"అని అంటారు.
సూర్యుడు నుంచి ఐదో స్థానంలో ఉన్న గురుగ్రహం పరిభ్రమణ కాలం దాదాపు 12 ఏళ్ల కాలం పడుతుంది.ఆరో స్థానంలో ఉన్న శనిగ్రహానికి 29.4 సంవత్సరాల కాలం పడుతుంది. ఇలాంటి సూర్యుడి చుట్టూ తిరుగుతూ గ్రహాలు చాలా దగ్గరకు వస్తాయి ఇలా రావడాన్ని" మహా సంయోగం లేదా గ్రేట్ కంజక్షన్ "అంటారు.
ప్రస్తుతం ఈ రెండు గ్రహాలు నిత్యం కొంత దగ్గరగా వస్తున్నాయి.
సోమవారం అంటే 20 డిసెంబర్ 2020 నాడు అతి దగ్గరగా చేరి అత్యంత ప్రకాశవంతంగా కనిపించనున్నాయి.
దాదాపు నాలుగు శతబ్దాల తర్వాత ఈ అద్భుతం చోటు చేసుకోనుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతూ వచ్చారు.
ఈ అద్భుతాన్ని నేరుగా చూడొచ్చు
అంతకుముందు 1623లో ఇలాంటి దృశ్యమే చోటుచేసుకుంది.
0 Comments