మన వంటగదిలో ఉండే ఆవాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో మెగ్నీషియం, క్యాల్షియం, మాంగనీస్, యాసిడ్స్, ప్రోటీన్స్ ఒమెగా-3 మరియు పీచు పదార్థాలు ఉంటాయి.




దీనిలో ఖనిజ లవణాలు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా కనిపిస్తాయి ఇవి ఆరోగ్యానికి కాదు ఆయుర్వేదంలో కూడా చాలా బాగా ఉపయోగపడతాయి.

మూత్రం సమస్య ఉన్న వాళ్ళు రోజు రాత్రి 1 స్పూన్ ఆవాల పొడిని అన్నం తినేటప్పుడు మొదటి ముద్దలో కలుపుకొని ఒక నెల రోజు తింటే చాలు ఈ మూత్ర సమస్యలు పోతాయి.

తేలు కాటు వేసిన ప్రదేశంలో ఒక స్పూన్ ఆవాలు, రెండు వెల్లుల్లి రెబ్బలు, ఒక స్పూన్ బెల్లము, మెత్తగా నూరి తేలు కుట్టిన ప్రదేశంలో పెట్టి కట్టు కట్టండి దీనివల్ల విషం అనేది శరీరం లోపలికి వెళ్ళదు మరియు దాని వల్ల వచ్చే మంట తగ్గుతుంది.

తలలో పేలు సమస్య ఉన్నవారు ఆవాల పొడి లో కొన్ని వాటర్ ని కలిపి పేస్టులాగా చేసి తలకు బాగా అప్లై చేసి తర్వాత తలస్నానం చేయాలి ఇలా వారానికి ఒకసారి చేస్తే తలలో పేలు సమస్య దూరమవుతుంది.

కాళ్లు చేతులు చల్లబడటం తిమ్మిర్లు రావడం వంటి సమస్య ఉన్న వాళ్లు కొద్దిగా ఆవాల పొడి లో కొన్ని వాటర్ వేసి పేస్ట్ లా చేసి ఆ పేస్ట్ తిమ్మిర్లు వచ్చిన ప్లేస్ లో రాస్తే బ్లడ్ సరఫరా బాగా జరిగి తిమ్మిర్లు తగ్గుతాయి.

కీళ్ల నొప్పులు ఉన్నవారు ఆవాల పొడిని వాటర్ లో కలిపి పేస్ట్ చేసి నొప్పులు ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. దీనివల్ల నొప్పి తొందరగా ఉపశమనం కలుగుతుంది కానీ ఈ ఆవాలు ఎక్కువగా ఘాటు గా ఉంటాయి కాబట్టి కొద్దిసేపటి తర్వాత తీసివేయాలి.

మూర్చ వచ్చి పడిపోయిన వారికి ఈ ఆవపొడి వారి ముక్కు దగ్గర పెడితే తొందరగా వారు మెలకువలోకి వస్తారు.

నీళ్ళ వరేచనాల సమస్య ఉన్నవారు సగం చెంచా వేయించిన ఆవాల పొడిని తీసుకొని, ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో తాగితే ఈ సమస్య తగ్గుతుంది.

పిల్లల్లో పక్క తడిపే అలవాటు ఉన్నవారికి సగం చెంచా వేయించిన ఆవాల పొడి లో సగం స్పూన్ పాలలో కలిపి రాత్రి పడుకునే ముందు పిల్లలతో తాగించాలి.
(లేదా)
సగం స్పూన్ వేయించిన ఆవాలు పొడిలో కొద్దిగా బెల్లం కలిపి ముద్దలా చేసి మాత్రలుగా చేసి రోజుకు ఒకటి రాత్రి పడుకునే సమయంలో వేయాలి. ఇలా చేస్తే ఈ సమస్య దూరమవుతుంది.

ఆవాల పొడి పంటి సమస్యలు చాలా బాగా తగ్గిస్తుంది.పిప్పి పన్ను సమస్య , మరియు దంతాల నొప్పులు, సెన్సిటివ్ దంతాల సమస్య మరియు సమస్యలు దూరం చేస్తుంది. ఒక స్పూన్ ఆవాల పొడిలో ఒక స్పూన్ సైంధవలవణం కలిపి దంతాలను తోముకోవాలి

జలుబు ముక్కు దిబ్బడ గొంతు పట్టడం వంటి సమస్యలు ఉన్నవారు ఆవనూనెలో 4 కర్పూరం బిళ్లను పొడిచేసి , కొద్దిగా వాము పొడి కలిపి వేడి చేయాలి. ఆ నూనెను ముక్కు దగ్గర చాతి  దగ్గర రాసుకుంటే ఈ సమస్య దూరమవుతుంది.

ప్రతి 100 గ్రాములు (100g) ఆవలలో 9.82 గ్రాముల టోకోఫెరాల్ అనే పదార్థం ఉంటుంది ఇది విటమిన్-ఇ కి సమానం.

ఆవాలు లోని సెలీనియం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఊపిరితిత్తుల సమస్యలను వాపులను తగ్గిస్తుంది.

ఆవనూనెతో వంటలు వండుకుంటే క్యాన్సర్ వంటి సమస్యలు రావు.

సగం బకెట్ గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ ఆవాల పొడి వేసి పాదాలు అరగంట సేపు ఉంచితే అరి కాళ్ళ నొప్పులు త్వరగా తగ్గుతాయి.

ఆవనూనెను శరీరానికి రాసుకుంటే శరీరం మంచి రంగు లోకి వస్తుంది.

ఆవ నూనె ,కొబ్బరి నూనె కలిపి తలకు రాసుకుంటే జుట్టు రాలే సమస్యను తగ్గిస్తాయి.

ప్రతి రోజు నాలుగు గ్రాముల (4gm) ఆవాలు నమిలి మింగితే జీర్ణశక్తి పనితీరు మెరుగవుతుంది.

ఆవనూనెను ముక్కు బ్లాక్ అయిన వారికి గోరువెచ్చని నూనెను ముక్కులో ఒక్క చుక్క వేస్తే ఈ సమస్య తగ్గుతుంది.


గమనిక: పైన తెలిపినవి చిట్కాలు మరియు ప్రథమ చికిత్స మాత్రమే పూర్తి పరిష్కారమార్గం కాదు నచ్చితే ఆచరించండి.ఆరోగ్య సమస్యలు ఉన్నవారు  వెంటనే వైద్యుని సంప్రదించండి.