శ్రీ గజేంద్ర మోక్షం లో ని గజేంద్రుని పూర్వ జన్మ కథ మీకు తెలుసా?


పరీక్షిన్మహారాజా! ఒక రోజు విష్ణుమూర్తిని మనసులో ధ్యానం చేస్తూ ఇంద్రద్యుమ్నుడు మౌనంగా ఏకాగ్రచిత్తంతోఉన్నాడు. అప్పుడు అక్కడకి అగస్త్య మహర్షి వచ్చాడు. రాజు తనను గౌరవించ లేదని. లేవకుండ మౌనంగా ఉన్నాడని ఆగ్రహించాడు “ఓరీ మూర్ఖుడా! పిసినిగొట్టు! ఏనుగు కడుపున జన్మించు.” అని అతనికి శాపమిచ్చాడు

అగస్త్య మునీశ్వరుని అవమానించిన గొప్పవాడైనట్టి ఇంద్రద్యుమ్న మహారాజు ఏనుగుగా పుట్టాడు. అందుకే ఎంతటి గొప్ప పుణ్యాత్ములైనా సరే బ్రాహ్మణులను అవమానించరాదు.

ఓ రాజేంద్ర! ఇంద్రద్యుమ్నుడు గజేంద్రుడుగా పుట్టాడు. అతని భటు లందరు ఏనుగులుగా పుట్టారు. ఏనుగుగా పుట్టినా కూడ అతనికి విష్ణుభక్తి వల్ల గొప్పదైన ముక్తి లభించింది.

 భక్తుడు తన పనులు తను నిర్వర్తించాలి, విష్ణుమూర్తిని సేవించాలి. ఈ రెండు నియమాలు సక్రమంగా పాటిస్తే క్రమంగా అతని పాపా లన్నీ నశించిపోతాయి. మిక్కిలి బలవంత మైనట్టి విష్ణుభక్తి ఎప్పటికి నశించదు.

 దుర్జనులకు వారి ఏనుగులు, గుఱ్ఱాలు, సంపదలు అన్ని నశించిపోతాయి. వారి ఆలుబిడ్డలు నశించిపోతారు. గుణవంతు లైన సజ్జనులు చెడకుండ బతుకుతారు. వారికి విష్ణుభక్తి మీది ఆసక్తి చెడదు