ఉసిరి పురాణగాధ క్షీరసాగరమథనం తరువాత అమృతం కోసం దేవదానవుల మధ్య జరిగిన పెనుగులాటలో కొన్ని చుక్కలు నేల మీద పడ్డాయనీ, అదే ఉసిరి చెట్టుగా మారిందినీ ఓ నమ్మకం. సకల వ్యాధులనూ నివారించి దీర్ఘాయువుని ప్రసాదించే అమృతంతో ఉసిరిని పోల్చడం సహేతుకంగానే తోస్తుంది. ఇక ఉసిరికి ఆయుర్వేదంలో ఉన్న ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే.


బాలింత దగ్గర నుంచి పండుముసలి వరకు ఆహారంలో ఉసిరి తప్పనిసరిగా తినాలనేది మన పూర్వీకలు చెప్తున్నారు.ప్రస్తుతం కూడా సీవిటమిన్‌ ఇచ్చే ఉసిరి గురించి అందరూ తెలుసుకుంటూ వాడుతున్నారు. ఆమ్ల గుణం కనిపిస్తుంది కాబట్టి దీనికి ఆమలకము లేదా ఆమ్లా అని పిలుస్తారు. ఇక కార్తీక మాసంలోనే ఉసిరికి ఎందుకంత ప్రాధాన్యత అనేక కారణాలు కనిపిస్తాయి. చలి విజృంభించే కార్తీక మాసాన కఫసంబంధమైన, జీర్ణసంబంధమైన వ్యాధులు అనేకం వచ్చే అవకాశం ఉంటుంది. ఉసిరిని తీసుకోవడం, ఉసిరికి దగ్గరగా ఉండటం వల్ల ఈ దోషాలు కొంతవరకూ పరిహరిం పబడతాయి.

ఉసిరిలోని విటమిన్ సి ఈ మాసంలో వచ్చే కఫ సంబంధమైన జబ్బులను నివారిస్తే, అందులోని పీచు, ఆమ్ల గుణాలు జీర్ణ సంబంధ సమస్యలను తీరుస్తాయి. అందుకే కార్తీక మాసం యావత్తూ ఉసిరికి సంబంధించిన నియమాలు కనిపిస్తాయి. మరీ ముఖ్యంగా క్షీరాబ్ది ద్వాదశినాడు `ధాత్రి సహిత లక్ష్మీనారాయణస్వామినే నమః` అంటూ విష్ణుమూర్తిని కొలుచుకుంటారు (ధాత్రి అంటే ఉసిరి). ఉసిరిని సాక్షాత్తూ విష్ణుస్వరూపంగా కొలుచుకుంటారు హైందవులు. అలాంటి ఉసిరి కాయలు, కొమ్మలు, చెట్టు సమీపంలో ఉండేలా అనేక నియమాలను ఆచరిస్తారు. ఉసిరిని సేవిస్తారు. అప్పటి వరకూ కురిసిన వర్షాలతో బలాన్ని పుంజుకున్న ఉసరి కూడా ఈ సమయంలో చక్కటి కాయలతో, పచ్చటి కాండంతో శక్తిమంతంగా ఉండి సకల ఆరోగ్యాలనూ అందిస్తుంది.

ఉసిరికాయ ప్రయోజనాలు

ఉసిరికాయలో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉండి ఆరోగ్యానికి మంచిది. ఆయుర్వేదంలో చ్యవన్ ప్రాస్ దీని నుండి తయారుచేస్తారు.

దక్షిణ భారతదేశంలో ఉసిరికాయను ఊరగాయ క్రింద లేదా ఉప్పు, కారంలో ఊరబెట్టి తినడానికి చాలా ఇష్టపడతారు.

హిందువులు ఉసిరిచెట్టును పవిత్రంగా భావిస్తారు. కార్తీకమాసంలో వనమహోత్సవాలలో ఉసిరిచెట్టు క్రింద భోజనం చేయడం శ్రేష్ఠం అన్ని నమ్ముతారు.

ఉసిరి కాయలను పచ్చడికి, జాం, జెల్లీ, సాస్ తయారీల్లోకూడ వుపయోగిస్తారు.

ప్రతిరోజు ఉసిరికాయ తినడం వలన మలబద్ధకం తగ్గుతుంది.

ఉసిరికాయ కంటి చూపును పెంచడములో సహాయపడుతుంది.

2 చెంచాల ఉసిరికాయ పొడిని 2 చెంచాల తేనెలో కలుపుకొని రోజుకి మూడు లేక నాలుగు సార్లు తాగుతూ ఉంటే జలుబు తగ్గుతుంది.

ఉసిరికాయ రోజు తినడము వలన రోగనిరోధక శక్తిని పెరుగుతుంది.

డయాబెటిక్ రోగిలో ఆమ్లా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. డయాబెటిస్‌ను నయం చేయడానికి మీరు చిటికెడు పసుపుతో ఆమ్లా జ్యూస్‌ను తీసుకోవచ్చు. 

గుండె కండరాలను బలోపేతం చేస్తున్నందున, ఆమ్లా గుండె రోగులకు కూడా ఉపయోగపడుతుంది. 

శరీరంలో ఎర్ర రక్త కణాలను పెంచడంతో, ఆమ్లా హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది.

 జ్ఞాపకశక్తిని పదును పెట్టడానికి ఆమ్లా మంచిది మరియు మెదడుకు మంచిది.  మెదడు జ్ఞాపకశక్తిని పునరుద్ధరించడానికి ఆమ్లా యొక్క మురబ్బాతో చక్కెర లేకుండా ఒక కప్పు పాలు తీసుకోండి. 

ఆమ్లా పురుషులు మరియు మహిళలు ఇద్దరికీ మద్దతు ఇస్తుంది మరియు గర్భం ధరించడంలో సమస్యను అధిగమించడంలో సహాయపడుతుంది.

 తీపి విపాకా ఆస్తిని కలిగి ఉన్నందున స్పెర్మ్‌ల నాణ్యతను మెరుగుపరచడంలో ఆమ్లా సహాయపడుతుంది.

బరువు నియంత్రణకు: ఉసిరి తీనటం వలన శరీరంలోని అదనపు కొవ్వును కరిగించుకోవచ్చు, అలాగే నిధానంగా బరువు కూడా తగ్గించుకోవచ్చు.